ఈవీల కొనుగోలుకు ఇదే మంచి సమయం.. రూ. లక్షకు పైగా తగ్గించిన టాటా మోటార్స్

  • టాటా నెక్సాన్, టియాగో ఈవీలపై రూ. 1.2 లక్షల రాయితీ ప్రకటన
  • ఇటీవల లాంచ్ చేసిన పంచ్ ఈవీ ధరలు ముట్టుకోని టాటా
  • వాహన తయారీలో కీలకమైన బ్యాటరీ సెల్స్ ధరలు తగ్గుముఖం పట్టడమే కారణం
ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు ఇదే మంచి అవకాశం. దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ రాయితీలు ప్రకటించింది. టాటా నెక్సాన్, టియాగో ఈవీపై రూ. 1.2 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. కార్లలో ఉపయోగించే బ్యాటరీల ధరలు తగ్గడంతో ఆ మేరకు ధరలు తగ్గించింది. నెక్సాన్, టియాగో ధరలు తగ్గించినప్పటికీ ఇటీవల లాంచ్ చేసిన పంచ్ ఈవీ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

ధర తగ్గింపు తర్వాత టాటా టియాగో ఈవీ ప్రారంభ ధర భారత్‌లో రూ. 7.99కు దిగొచ్చింది. నెక్సాన్ ధర రూ. 14.49 లక్షలు కాగా, లాంగ్ రేంజ్ నెక్సాన్ ఈవీ ప్రారంభ ధర రూ. 16.99 లక్షలకు తగ్గింది. ధరల తగ్గింపుపై టాటా ప్యాసెంజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో బ్యాటరీల ధరే కీలకమని పేర్కొన్నారు. ఇటీవల బ్యాటరీ సెల్ ధరలు తగ్గముఖం పట్టడంతో ఆ మేరకు వాహనాల ధరలు కూడా తగ్గించినట్టు తెలిపారు.


More Telugu News