"ఈయన అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్"... రూప్ కుమార్ ను చంద్రబాబుకు పరిచయం చేసిన కోటంరెడ్డి
- నెల్లూరులో టీడీపీ సభ
- టీడీపీలోకి క్యూ కట్టిన నెల్లూరు వైసీపీ ముఖ్య నేతలు
- చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్
- రూప్ కుమార్ భుజం తట్టిన చంద్రబాబు
ఇవాళ నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ లో జరిగిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో చాలామంది వైసీపీ నేతలు పసుపు కండువాలు కప్పుకున్నారు. తొలుత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు టీడీపీలో చేరారు. ఆ తర్వాత నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
ఈ సందర్భంగా వేదికపై ఆసక్తికర దృశ్యం కనిపించింది. రూప్ కుమార్ కు చంద్రబాబు టీడీపీ కండువా కప్పిన అనంతరం... ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చి... ఈయన అనిల్ కుమార్ కు బాబాయ్ అంటూ రూప్ కుమార్ యాదవ్ ను చంద్రబాబుకు పరిచయం చేశారు. అవునా... అంటూ చంద్రబాబు రూప్ కుమార్ భుజం తట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నెల్లూరు వైసీపీలో ఎప్పటినుంచో ఆధిపత్య పోరు ఉంది! నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ కు, ఆయన బాబాయి, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కు మధ్య విభేదాలు పలు సందర్భాల్లో వెల్లడయ్యాయి.
రూప్ కుమార్ యాదవ్ ముఖ్య అనుచరుడు అబ్దుల్ హాజీపై కొన్నాళ్ల కిందట దాడి జరిగింది. తాను రూప్ కుమార్ కు మద్దతు ఇస్తున్నందునే తనపై దాడి చేశారని హాజీ ఆరోపించాడు.
గాయపడిన హాజీని పరామర్శించిన సమయంలో రూప్ కుమార్... అనిల్ కుమార్ యాదవ్ పై మండిపడ్డారు. పైకి నీతులు చెప్పడం కాదు... నీ అనుచరులు ఏం చేస్తున్నారో చూసుకో అంటూ అబ్బాయిపై నిప్పులు చెరిగారు.
నిన్ను ఎన్నికల్లో గెలిపించడానికి శత్రువులతో పోరాడాం... అలాంటిది ఇప్పుడు మాపైనే దాడులు చేయిస్తావా? అంటూ రూప్ కుమార్ నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు.