రేపటి నుంచి జియో సినిమాలో 'హనుమాన్' మూవీ
- రేపటి నుంచే 'కలర్స్ సినీప్లెక్స్' టీవీ ఛానెల్‌లో కూడా టెలికాస్ట్
- ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించిన జియో సినిమా
- 2024లో తొలి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన హనుమన్
- వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.293.30 కోట్లు కొల్లగొట్టిన మూవీ
యువ నటుడు తేజా సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ మూవీ పాన్ ఇండియా హిట్‌ను అందుకున్న విషయం తెలిసిందే. విడుదలైన అన్నీ భాషల్లో ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టి 2024లో తొలి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇలా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకున్న హనుమాన్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ఇన్నాళ్లు ఈ మూవీ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై, ఎప్పుడు విడుదలవుతుందనేది కొంతమేర గందరగోళానికి గురిచేసింది. చివరికి 'జియో సినిమా'లో మార్చి 16న (శనివారం) హనుమాన్ వస్తోంది. అలాగే అదే రోజు 'కలర్స్ సినీప్లెక్స్' టీవీ ఛానెల్‌లో కూడా టెలికాస్ట్ కానుంది. ఈ మేరకు జియో సినిమా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది.
బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు
జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ తొలిరోజు కేవలం 9.3కోట్లు మాత్రమే రాబట్టింది. కానీ, వారం గడిచేసరికి చాలా ఈజీగా రూ.100కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇందులో అధిక వాటా రెండు తెలుగు రాష్ట్రాలదే. కేవలం మౌత్‌టాక్‌తోనే జనాలు ఈ మూవీకి బ్రహ్మారథం పట్టారు. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న హనుమాన్ చాలా సులవుగా రూ.200 కోట్ల వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా కనకవర్షం కురిపించింది. అక్కడ రూ.56.80 కోట్లు కొల్లగొట్టింది. ఇలా వరల్డ్‌వైడ్‌గా హనుమాన్ ఏకంగా రూ.293.30 కోట్లు రాబట్టింది.
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో తేజా సజ్జాకు జోడిగా అమృత అయ్యర్ నటించింది. వరలక్ష్మీ శరత్‌కుమార్, రాజ్ దీపక్ శెట్టి, వినయ్ రాజ్, గేటాప్ శీను ఇతర కీలక పాత్రల్లో నటించారు.