మనవడితో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్న సీఎం రేవంత్ రెడ్డి... ఫొటోలు ఇవిగో!

  • నేడు హోలీ పండుగ
  • దేశవ్యాప్తంగా సంబరాలు
  • సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో హోలీ వేడుకలు
ఇవాళ హోలీ పండుగ కావడంతో దేశవ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. కాగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కుటుంబ సభ్యులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. 

ముఖ్యంగా, మనవడు రేయాన్స్ తో కలిసి హోలీ వేడుకలను ఆస్వాదించారు. మనవడి చిరునవ్వులు చూస్తూ రేవంత్ రెడ్డి మురిసిపోయారు. మనవడితో రంగులు పూయించుకుంటూ, తాను మనవడికి రంగులు పూస్తూ ఉల్లాసంగా కనిపించారు.  ఈ సంబరాల్లో రేవంత్ రెడ్డి అర్ధాంగి గీతారెడ్డి కూడా పాలుపంచుకున్నారు. సీఎం ఇంట జరిగిన హోలీ సంబరాలకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. 

రేవంత్ రెడ్డి కుమార్తె నైమిష గతేడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బిడ్డకు తల్లిదండ్రులు రేయాన్స్ అని నామకరణం చేయగా, రేవంత్ రెడ్డి తనకు ఇష్టమైన కాకతీయ రాజుల పరాక్రమాలకు ప్రతీకగా మనవడికి రుద్రదేవుడు అని పేరుపెట్టుకున్నారు.


More Telugu News