ఎక్స్ పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్ లు చేస్తున్నది మీరే!: వేమిరెడ్డికి విజయసాయిరెడ్డి చురక
- నెల్లూరు నుంచి వేమిరెడ్డితో పోటీపడుతున్న విజయసాయిరెడ్డి
- ఢిల్లీకి ఎక్స్ పోర్ట్ అవుతానని వేమిరెడ్డి ఛలోక్తులు విసురుతున్నారంటూ విజయసాయి విమర్శలు
- తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని స్పష్టీకరణ
- పార్టీలు మారడం తనకు తెలియదని ఎద్దేవా
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రానున్న ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. నెల్లూరు పార్లమెంటు స్థానం బరిలో ఆయనకు టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రత్యర్థిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వేమిరెడ్డిపై విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. తనపై వేమిరెడ్డి చేస్తున్న విమర్శలకు బదులిచ్చే ప్రయత్నం చేశారు.
"నేను ఎన్నికల్లో గెలిచిన తర్వాత నెల్లూరును పట్టించుకోనని, ఢిల్లీకి ఎక్స్ పోర్ట్ అవుతానని వేమిరెడ్డి గారు ఛలోక్తులు విసురుతున్నారు. ఎక్స్ పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్ లు చేస్తున్నది వేమిరెడ్డే... అందుకే ఆయన అలవాటుగా ఆ పదం వాడి ఉంటారు.
నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. పార్లమెంటు సమావేశాలప్పుడు తప్ప మిగిలిన రోజులు నెల్లూరులోనే ఉంటాను. ప్రాణం పోయే వరకు జగన్ వెంటే ఉంటాను. పార్టీలు మారడం నాకు తెలియదు, వేమిరెడ్డి గారూ. రాజ్యసభ సభ్యుడిగా ప్రతి రోజూ సభకు హాజరయ్యాను. రాష్ట్ర సమస్యలను ఎక్కువగా ప్రస్తావించింది నేనే.
మీరు రాజ్యసభ సభ్యుడిగా అటు పార్లమెంటుకు రాలేదు, ఇటు నెల్లూరులోనూ లేరు... వ్యాపార పనుల్లో దేశాలు తిరుగుతున్నారు" అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.