రేపు అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా పుష్ప-2 నుంచి సూపర్ టీజర్

  • ఏప్రిల్ 8న పుట్టినరోజు జరుపుకోనున్న అల్లు అర్జున్
  • రేపు ఉదయం 11.07 గంటలకు పుష్ప-2 టీజర్ విడుదల
  • పుష్పరాజ్ మేనియాతో ఊగిపోతున్న అభిమానులు
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేపు (ఏప్రిల్ 8) పుట్టినరోజు జరుపుకోనున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా పుష్ప-2 నుంచి సూపర్ టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 11.07 గంటలకు ఈ టీజర్ విడుదల చేయనున్నారు. 

చిత్రబృందం చెబుతున్న విషయాలను బట్టి చూస్తే పుష్పరాజ్ విశ్వరూపాన్ని ఈ టీజర్ ఆవిష్కరిస్తుందని అర్థమవుతోంది. గత కొన్నిరోజులుగా అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ టీజర్ రూపకల్పన కోసం శ్రమిస్తున్నారు. 

ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వస్తున్న అప్ డేట్లు చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్పరాజ్ మేనియాతో ఊగిపోతున్నారు. ఇవాళ విడుదల  చేసిన పోస్టర్ లో అల్లు అర్జున్ గొడ్డలి పట్టుకుని సింహాసనంపై కూర్చుని ఉండడం చూడొచ్చు.


More Telugu News