'పుష్ప‌-2' టీజ‌ర్ వ‌చ్చేసింది.. మ‌రోసారి మెస్మ‌రైజ్ చేసిన పుష్ప‌రాజ్‌!

  • అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 'పుష్ప‌-2' టీజ‌ర్ విడుద‌ల‌
  • టీజ‌ర్‌లో గంగమ్మ జాతరను హైలైట్ చేసిన చిత్రం యూనిట్‌
  • టీజర్ విజువల్స్ ఒక ఎత్తు.. ఐకాన్ స్టార్ లుక్,పెర్ఫార్మన్స్ మరో ఎత్తు 
  • గూస్ బంప్స్ తెప్పించ్చేలా దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ 
  • ఆగ‌స్టు 15వ తేదీన థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్న 'పుష్ప‌-2'
'పుష్ప‌-2' టీజర్ వ‌చ్చేసింది. సోమ‌వారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు 'పుష్ప: ది రూల్' చిత్ర బృందం బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. పుష్ప‌రాజ్ మ‌రోసారి త‌న న‌ట‌న‌తో మెస్మ‌రైజ్ చేశాడ‌నే చెప్పాలి. బ‌న్నీకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు తెచ్చిన 'పుష్ప: ది రైజ్'కు సీక్వెల్‌గా వ‌స్తున్న‌ 'పుష్ప 2'పై ఇప్ప‌టికే భారీ అంచనాలు ఉన్న విష‌యం తెలిసిందే. ఆ అంచ‌నాల‌ను అందుకునేలా ఇవాళ విడుదలైన టీజర్ ఉంది.

ఇక టీజ‌ర్‌లో గంగమ్మ జాతరను హైలైట్ చేశారు. ఇప్ప‌టికే విడుదలైన గంగ‌మ్మ జాత‌ర తాలూకు ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అందుకే ఆ లుక్‌ను మేక‌ర్స్‌ ఈ టీజర్‌లోనూ కంటిన్యూ చేశారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ గూస్ బంప్స్ తెప్పించ్చేలా ఉంది. టీజర్ విజువల్స్ ఒక ఎత్తు.. ఐకాన్ స్టార్ లుక్, పెర్ఫార్మన్స్ మరో ఎత్తు అని చెప్పాలి. స్క్రీన్‌పై పుష్పరాజ్ తప్ప మరొకరు ప్రేక్షకుల కళ్లకు కనిపించరు. 

ఐకాన్ స్టార్ పుట్టిన‌రోజుకు క్రియేటివ్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ ది బెస్ట్ గిఫ్ట్ ఇచ్చారు. 'పుష్ప 2' టీజర్‌తో రికార్డుల మాస్ జాతర మొదలు అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ మూవీ ఆగ‌స్టు 15వ తేదీన థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో 'పుష్ప‌-2' విడుద‌ల కానుంది.


More Telugu News