స్నో కింగ్డమ్ లో ‘గామి’ మూవీ ప్రెస్ మీట్‌.... ఇది దేశంలోనే తొలిసారి: విష్వక్సేన్

  • విష్వక్సేన్, చాందిని చౌదరి జంటగా గామి
  • మార్చి 8న రిలీజ్
  • ఏప్రిల్ 12 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్
  • వెరైటీగా స్నో కింగ్డమ్ లో మీడియా సమావేశం ఏర్పాటు 
విష్వక్సేన్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘గామి’. కార్తిక్ శబరీష్ నిర్మాతగా వచ్చిన ఈ మూవీకి నరేశ్ కుమరన్ సంగీతాన్ని అందించారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 12 నుంచి జీ5 ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ స్నో కింగ్‌డమ్‌లో మీడియాతో ముచ్చటించింది. 

హీరో విష్వక్సేన్ మాట్లాడుతూ... ఇంత తక్కువ ఉష్ణోగ్రతలో ఇలా స్నో కింగ్‌డమ్‌లో నిర్వహించాలనే ఐడియా అంతా కూడా జీ5 టీమ్ దేనని వెల్లడించారు. "ఇలాంటి ఐడియా నాకు ఎందుకు రాలేదని అనుకుంటున్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కూడా ఇలా చలిలోనే చేసేవాడ్ని. గామిలాంటి సినిమాలకు మామూలుగా అవార్డులు, ప్రశంసలు వస్తుంటాయి.. కలెక్షన్లు రావని అంతా అనుకుంటారు. కానీ ఇది నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్, కలెక్షన్లను సాధించింది. 

గామిలో కమర్షియల్ అంశాలేవీ ఉండవు. అయినా ఆడియెన్స్ చాలా బాగా ఆదరించారు. వారణాసిలోని ఘాట్‌లో శవాలు కాలుతున్నా కూడా ఓ 20 నిమిషాలు షూట్ చేశాం. చావుని వాళ్లు సెలెబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు నాకు జీవితం చాలా చిన్నది అనిపించింది. 

ఇలాంటి కథను నమ్మాలి. నాకు పెద్ద రిస్క్ అనిపించలేదు. ఓ ఫ్లాప్ సినిమాను తీయడం కంటే.. ఇలాంటి కథను నమ్మడం బెటర్. గామి మూవీని థియేటర్లో అందరూ చూశారు. మాకు మంచి రివ్యూలు ఇచ్చారు. ఏప్రిల్ 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలోనూ మా చిత్రాన్ని చూడండి" అని అన్నారు.


More Telugu News