నేడు నామినేషన్ దాఖలు చేయనున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
- విశాఖ నుంచి ఎంపీగా, గాజువాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న కేఏ పాల్
- విశాఖ నుంచి గెలిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటానని హామీ
- గాజువాక నుంచి ఎన్నికైనా రాష్ట్రం కోసం పనిచేస్తానన్న పాల్
- తన పార్టీని గెలిపించాలని మీడియా సమావేశంలో విజ్ఞప్తి
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. విశాఖ నుంచి ఎంపీగా, గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో తన పార్టీని గెలిపించాలని ఆయన కోరారు.
తాను పార్లమెంటు సభ్యునిగా గెలిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తానని కేఏ పాల్ అన్నారు. గాజువాక నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తానన్నారు. తమ పార్టీ టిక్కెట్ల కోసం మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలోకి దించుతామన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆయన ఎన్నికల ప్రచార గీతాన్ని కూడా విడుదల చేశారు.