ప్రధాని మోదీ వల్లే మనం ఈరోజు బతికి ఉన్నాం: దేవేంద్ర ఫడ్నవీస్
- మోదీ మనకు వ్యాక్సీన్ ఇవ్వడం వల్లే ఈ రోజు బతికి ఉన్నామన్న మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి
- ఆయనకు ఓటు వేసి రుణం తీర్చుకోవాలన్న ఫడ్నవీస్
- కొవిడ్ వ్యాక్సీన్‌ను 100 దేశాలకు సరఫరా చేశామన్న బీజేపీ నేత
కరోనా సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ మనకు వ్యాక్సీన్ ఇవ్వడం వల్లే ఈరోజు బతికి ఉన్నామని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. మనం వ్యాక్సీన్ తీసుకొని ఉండకపోయి ఉంటే ఈరోజు ఈ ర్యాలీని చూసి ఉండేవాళ్లం కాదన్నారు. మన ప్రాణాలు కాపాడింది మోదీయే అన్నారు. శనివారం మహారాష్ట్రలోని సాంగ్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మోదీ వల్లే మనం బతికి ఉన్నాం కాబట్టి ఆయనకు ఓటు వేసి రుణం తీర్చుకోవాలని కోరారు.
కరోనా సమయంలో మోదీ మన సైంటిస్టులకు అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించి మన దేశంలోనే కొవిడ్ వ్యాక్సీన్ తయారయ్యేలా చేశారన్నారు. మరో 100 దేశాలకు వ్యాక్సీన్‌ను సరఫరా చేశామని గుర్తు చేశారు. ప్రారంభంలో కొన్ని దేశాలు మాత్రమే కరోనా వ్యాక్సీన్‌ను కనుగొన్నాయని... వ్యాక్సీన్ కోసం భారత్ తమ వద్దకు వస్తుందని ఇతర దేశాలు భావించాయని పేర్కొన్నారు. కానీ మోదీ మన సైంటిస్టులకు అన్ని విధాలుగా సహకారం అందించి కొవిడ్ వ్యాక్సీన్ తయారీని సులభతరం చేశారన్నారు.