భార్య సంజ‌న‌కు బుమ్రా స్పెష‌ల్‌ బ‌ర్త్‌డే విషెస్‌.. ట్వీట్ వైర‌ల్!

  • భార్యే త‌న ప్ర‌పంచం అంటూ సంజ‌న‌పై ప్రేమ‌ను చాటుకున్న జస్ప్రీత్ బుమ్రా
  • 2021 మార్చి 15న జ‌స్ప్రీత్ బుమ్రా, సంజనా గ‌ణేశ‌న్ వివాహం
  • ఈ దంప‌తుల‌కు గతేడాది కుమారుడు అంగ‌ద్ బుమ్రా జ‌న‌నం
భార‌త జ‌ట్టు స్టార్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా త‌న భార్య సంజ‌నా గ‌ణేశ‌న్‌కు 'ఎక్స్' (ట్విట‌ర్‌) వేదిక‌గా ప్ర‌త్యేకంగా బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేశాడు. ఈ సంద‌ర్భంగా భార్య‌పై త‌న‌కున్న ప్రేమ‌ను చాటుకున్నాడు. "నీతో జీవితం పంచుకోవ‌డం ఆనందాన్నిస్తోంది. నువ్వే నా ప్ర‌పంచం. నేను, అంగ‌ద్ (కొడుకు) ప్రేమ‌తో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాం" అని ట్వీట్ చేశాడు. దీనికి భార్య‌తో క‌లిసి బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ లో ఉన్న ఫొటోను జోడించాడు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

ఇదిలాఉంటే.. వృత్తిరీత్యా స్పోర్ట్స్ యాంకర్ అయిన‌ సంజన.. ఐపీఎల్ వంటి టోర్నీలను కూడా హోస్ట్ చేశారు. అంతకుముందు 2014లో మిస్ ఇండియా పీజెంట్‌ పోటీల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కొంతకాలం మోడల్‌గా పనిచేసి, అనంతరం రియాలిటీ షో యాంకర్‌గా కెరీర్ ఎంచుకున్నారు. ఇది జరిగిన కొంతకాలానికి టీమిండియా పేస‌ర్‌ బుమ్రాతో ప్రేమ‌లో ప‌డ‌డం, పెళ్లి చేసుకోవ‌డం జ‌రిగింది. 2021 మార్చి 15న జ‌స్ప్రీత్ బుమ్రా, సంజనా గ‌ణేశ‌న్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ దంప‌తుల‌కు గతేడాది కుమారుడు అంగ‌ద్ బుమ్రా జ‌న్మించాడు.


More Telugu News