కార్లలో క్యాన్సర్ కారక కెమికల్స్.. అధ్యయనంలో వెల్లడయిన షాకింగ్ నిజాలు!
- కార్లలో ఉన్నప్పుడు ప్రయాణికులు క్యాన్సర్ కారక కెమికల్స్ పీలుస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడి
- కారులో ప్రయాణించేటప్పుడు వచ్చే వాసనలు కాన్సర్‌కు దారితీస్తున్నట్లు చెబుతున్న పరిశోధనలు
- 101 ఎలక్ట్రిక్, గ్యాస్, హైబ్రిడ్ కార్లపై పరిశోధకుల అధ్యయనం
- 99 శాతం కార్లలో ప్రమాదకరమైన రసాయనాలు వెలువడినట్లు గుర్తించిన పరిశోధకులు
కార్లలో జర్నీ చేయడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మనకు అనుకూలమైన సమయంలో, అనుకున్న టైమ్‌లో గమ్యస్థానాలకు చేరిపోవచ్చు. ఇలా ఎంతో సౌకర్యవంతమైన జర్నీకి కార్లు చాలా ఉపయోగకరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఆ కారు జర్నీ వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. కార్లలో ఉన్నప్పుడు ప్రయాణికులు క్యాన్సర్ కారక కెమికల్స్ పీలుస్తున్నట్లు తాజాగా ఓ అధ్యయనం షాకింగ్ నిజాలను వెల్లడించింది.
కారులో ప్రయాణించేటప్పుడు వచ్చే వాసనలు కాన్సర్‌కు దారితీస్తాయని అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ విభాగానికి చెందిన నేషనల్ టాక్సాలజీ ప్రోగ్రామ్‌లో భాగంగా చేసిన అధ్యయనంలో బయటపడింది. ఇక ఈ అధ్యయనం కోసం 2015 నుంచి 2022 మధ్య కాలంలో వచ్చిన 101 ఎలక్ట్రిక్, గ్యాస్, హైబ్రిడ్ కార్లపై పరిశోధకులు రీసెర్చ్ చేశారు. ఈ అధ్యయనంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి.
99 శాతం కార్లలో ప్రమాదకరమైన రసాయనాలు వెలువడినట్లు పరిశోధకులు గుర్తించడం జరిగింది. వాటి నుంచి అగ్ని ప్రమాదాల్ని నివారించే టీసీఐపీపీ అనే కెమికల్స్, క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే టీడీసీఐపీపీ, టీసీఈపీ అనే రసాయనాలు కార్ల నుంచి విడుదలవుతున్నట్లు పరిశోధకులు కనుగొనడం జరిగింది. ఇక కార్లలో పలు కారణాల వల్ల వ్యాపించే మంటలను అదుపు చేసే కెమికల్స్ వలన ఎలాంటి ప్రయోజనం ఉండదనే విషయాన్ని అమెరికా హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన అధ్యయనంలో వెల్లడయినట్లు పరిశోధకులు తెలియజేశారు.
డైలీ కారులో సగటున గంటసేపు ప్రయాణం చేస్తే కచ్చితంగా ఆరోగ్యానికి హాని కలుగులుతుందని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన లీడ్ రీసెర్చర్ అండ్ టాక్సికాలజీ సైంటిస్ట్ రెబెకా హోయిన్ వెల్లడించారు. ఇక వేసవిలో ఈ కెమికల్స్ అధిక మోతాదులో విడుదల అవుతాయని నిపుణులు వెల్లడించారు. కాగా, కారు క్యాబిన్ గాలిలో క్యాన్సర్ కలిగించే పదార్థాల ప్రధాన మూలంగా సీట్ ఫోమ్‌ను పరిశోధకులు గుర్తించారు. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ద్వారా 1970ల నుండి నిర్దేశించబడిన భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా మొదట్లో ఫ్లేమ్ రిటార్డెంట్‌లు చేర్చబడ్డాయి. అయితే, ఆ తర్వాత అప్‌డేట్‌లు లేకుండా అలాగే కొనసాగాయి.
ఇదిలాఉంటే.. కార్లలో విడుదలయ్యే క్యాన్సర్ కారక రసాయనాలను తగ్గించేందుకు గ్రీన్ సైన్స్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ శాస్త్రవేత్త లిడియా జాహ్ల్ కొన్ని సూచనలు చేశారు.

- వీలైనప్పుడల్లా నీడలో లేదా బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో కార్లను పార్క్ చేయడం.
- పార్క్ చేసిన కార్లలో ఎక్కువ సమయం గడపకపోవడం. అందులోనూ వేసవి రోజులలో ఇంకా జాగ్రత్తగా ఉండడం.
- సహజ పదార్థాలతో తయారు చేయబడిన సీట్ కవర్లు, ఇతర కార్ ఇంటీరియర్ ఉపకరణాలను ఉపయోగించడం.
- తక్కువ దూరం ప్రయాణం చేసే సమయంలో కిటికీలను క్రమం తప్పకుండా తెరవడం ద్వారా సరైన వెంటిలేషన్ ఉండేటట్లు చూసుకోవడం.