అప్పటి నుంచి ఫ్రెండ్స్ ను నమ్మడం మానేశాను: సింగర్ అంజనా సౌమ్య
- గాయనిగా పేరు తెచ్చుకున్న అంజనా సౌమ్య
- చిన్నప్పటి నుంచి పాటలంటే ప్రాణమని వెల్లడి
- ఫ్రెండ్స్ చాడీలు చెప్పేవారని వ్యాఖ్య
- తన తల్లియే నిజమైన ఫ్రెండ్ అని వివరణ
అంజనా సౌమ్య .. టీవీలలో పాటల ప్రోగ్రామ్స్ ను చూసేవారికి ఈ పేరు బాగా పరిచయమే. తనని తన చూన్నప్పటి నుంచి ప్రేక్షకులు టీవీలలో చూస్తూనే వస్తున్నారు. తాజాగా ఐ డ్రీమ్స్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంజనా సౌమ్య మాట్లాడింది. "మా నాన్నగారు ఉద్యోగరీత్యా చాలా ప్రాంతాలకు తిరగవలసి వచ్చింది. అలా మేము 'కాకినాడ'లో ఉన్నప్పుడు నేను సంగీతం నేర్చుకున్నాను" అని అంది.
"స్కూల్ రోజులు చాలా సరదాగా గడిచాయి. ఆటపాటలతో ఆ రోజులు గడిచాయి .. అయితే ఎవరితోను నేను ఎక్కువగా మాట్లాడేదానిని కాదు. ఇప్పుడు కూడా నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ. బీటెక్ లో ఉండగా కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఇక్కడి మాటలు అక్కడ .. అక్కడ మాటలు ఇక్కడ చెబుతూ ఉండేవారు. దాంతో వీళ్లను ఇంతలా నమ్మితే ఇలా చేస్తారా అని నాకు కోపం వచ్చేది" అని చెప్పింది.
" ఫ్రెండ్స్ అలా చేసిన దగ్గర నుంచి ఇక నేను ఫ్రెండ్షిప్ గురించి ఆలోచన చేయలేదు. నాకు నిజమైన స్నేహితురాలు మా అమ్మనే. చదువులో నేను యావరేజ్ స్టూడెంట్ నే. సంగీతంలో మా మాస్టార్లు నన్ను చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. నేను ఇంతటి గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం వారే" అని చెప్పింది.