ఓటు వేశాక ప్రెస్ మీట్ పెట్టిన రేవంత్ రెడ్డి... ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేత రఘునందన్ రావు
- కొడంగల్‌లో ప్రెస్ మీట్ పెట్టి ప్రధాని మోదీ, బీజేపీపై విమర్శలు చేశారని ఆగ్రహం
- ఓటమిపై భయంతోనే ముఖ్యమంత్రి నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణ
- ఆయన ప్రెస్ మీట్‌పై ఈసీ తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మెదక్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈసీకి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. కొడంగల్‌లో ఓటు వేసిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీపైనా, బీజేపీపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఓటమిపై భయంతోనే ఆయన నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రచారం చేశారని విమర్శించారు. ఈసీ తక్షణమే స్పందించి ఆయనపై చర్యలు తీసుకోవాలని... గృహనిర్బంధంలో ఉంచాలని డిమాండ్ చేశారు.
మహబూబ్ నగర్ లోక్ సభ పరిధిలోని కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఓటు వేశారు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్‌ను పలు ఛానల్స్ ప్రసారం చేశాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, ఎన్డీయే పత్తాలేకుండా పోతుందన్నారు. దీనిపై బీజేపీ నేత రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు.