రెండు జేబీఎల్‌ స్పీకర్లు, 108 మెగాపిక్సెల్‌ కెమెరాతో ఇన్ఫినిక్స్‌ జీటీ 20 ప్రో.. ఫీచర్లు, ధర వివరాలివిగో!

  • తక్కువ ధరలో మంచి స్పెసిఫికేషన్లతో విడుదల కానున్న ఫోన్
  • మే 21వ తేదీన భారత్ లో విడుదల చేయనున్నట్టు కంపెనీ వెల్లడి
  • అద్భుతమైన గేమింగ్ అనుభూతిని అందించగలదని ప్రకటన
తక్కువ ధరల్లో మంచి స్పెసిఫికేషన్స్‌ తో ఫోన్లను అందించే ఇన్ఫినిక్స్‌ సంస్థ మరో ఫ్లాగ్‌ షిప్‌ ఫోన్‌.. ‘ఇన్ఫినిక్స్‌ జీటీ 20 ప్రో’ ఫోన్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో విడుదల చేసిన ఈ ఫోన్‌ ను మే 21వ తేదీన భారత దేశంలో విడుదల చేయనుంది. అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్‌ బడ్జెట్‌ ధరలోనే అందుబాటులో ఉంటుందని టెక్‌ మార్కెట్‌ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నథింగ్‌ ఫోన్‌ 2ఏ, రెడ్‌ మీ నోట్‌ 13 ప్రో, రియల్‌ మీ 12ప్రో ఫోన్లకు.. ‘ఇన్ఫినిక్స్‌ జీటీ 20 ప్రో’ గట్టి పోటీ ఇస్తుందని అంటున్నాయి.

‘ఇన్ఫినిక్స్‌ జీటీ 20 ప్రో’ ఫీచర్లు ఇవీ..
  • ఈ ఫోన్‌ లో 2జీ, 3జీ, 4జీ, 5జీ నెట్‌ వర్క్‌ లను ఉపయోగించుకోవచ్చు. 164.2 మిల్లీమీటర్ల పొడవు, 75.43 మిల్లీమీటర్లు, 8.15 మిల్లీమీటర్ల మందంతో వస్తుంది. బరువు 194 గ్రాములు.
  • 6.78 అంగుళాల భారీ స్క్రీన్‌ తో ఫుల్‌ హెచ్‌ డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ ప్లే ఉంది. 144 హెట్జ్‌ రీఫ్రెష్‌ రేటుతో అద్భుతమైన గేమింగ్‌ అనుభూతిని అందించగలదు.
  • ఇందులో డైమెన్సిటీ 8200 ఆక్టాకోర్‌ 3.1 గిగాహెట్జ్‌ వేగవంతమైన ప్రాసెసర్‌ ను అమర్చారు. అద్భుతమైన గేమింగ్‌ కోసం ప్రత్యేకమైన డిస్‌ ప్లే చిప్‌ కూడా ఉంది.
  • 256 జీబీ ఇన్‌ బిల్ట్‌ మెమరీ ఇచ్చారు. 8 జీబీ ర్యామ్‌/12 జీబీ ర్యామ్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది.
  • వెనుక భాగాన 102 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరా, మరో 2 మెగాపిక్సెల్‌ మాక్రో కెమెరా, ఇంకో 2 మెగాపిక్సెల్‌ వైడ్‌ యాంగిల్‌ కెమెరాలు కలిపి ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంది. ముందుభాగంలో 32 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ విషయానికి వస్తే.. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 45 వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌ ను సపోర్ట్‌ చేస్తుంది.
  • స్క్రీన్‌ లో భాగంగానే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ను అమర్చారు. 
  • అనవసరపు అంశాల జోలికి వెళ్లకుండా ఈ ఫోన్‌ లో ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ‘క్లీన్‌ అండ్‌ ప్యూర్‌ ఓఎస్‌’ను ఇన్‌ స్టాల్‌ చేసినట్టు కంపెనీ తెలిపింది.
  • మెకా బ్లూ, మెకా ఆరెంజ్‌, మెకా సిల్వర్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది. 
  • ఈ ఫోన్‌ 8 జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ.24,999గా ఉండవచ్చని టెక్‌ వర్గాల అంచనా. ఫోన్‌ విడుదల సందర్భంగా ఇన్ఫినిక్స్‌ కంపెనీ రేటును ప్రకటించనుంది.
  • అయితే.. ఈ ఫోన్ లో జేబీఎల్ సంస్థకు చెందిన రెండు స్పీకర్లు ఉండనున్నట్టు టెక్ వర్గాలు చెప్తున్నాయి. ఫోన్ ను ఇండియాలో విడుదల చేసేప్పుడు.. స్థానిక పరిస్థితులు, ధరల వేరియంట్లకు తగినట్టుగా.. ఫీచర్లలో మార్పులు చేసే అవకాశం ఉందని అంటున్నాయి.


More Telugu News