ఈ సీఎస్ వద్దు... కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కు లేఖ రాసిన కనకమేడల

  • జవహర్ రెడ్డి ప్రభుత్వ అసైన్డ్ భూములు కొనుగోలు చేశారని ఆరోపణ
  • కొడుకు, బినామీల పేరిట 800 ఎకరాలు కొన్నారని వెల్లడి
  • రిజిస్ట్రేషన్ కోసం అధికారులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపణ
  • కౌంటింగ్ సజావుగా సాగడంపై అనుమానం ఉందంటూ సీఈసీకి లేఖ
టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు లేఖ రాశారు. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి  ప్రభుత్వ అసైన్డ్ భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారని వెల్లడించారు. 

తన కుమారుడు, బినామీల పేరిట సీఎస్ భూములు కొన్నారని వివరించారు. ఆ విధంగా సీఎస్ 800 ఎకరాలు కొనుగోలు చేశారని కనకమేడల తెలిపారు. ఇప్పుడు భూముల రిజిస్ట్రేషన్ కోసం అధికారులను ప్రభావితం చేస్తున్నారని తన లేఖలో పేర్కొన్నారు. 

సీఎస్ అధికార యంత్రాంగాన్ని, తన అధికారాలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఆయన ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని తెలిపారు. 

ఈ నేపథ్యంలో, కౌంటింగ్ సజావుగా సాగడంపై ప్రతిపక్షాలకు అనుమానం ఉందని కనకమేడల వెల్లడించారు. సీఎస్ వ్యవహార శైలి ఓట్ల లెక్కింపుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎస్ ని తొలగించి సీబీఐ విచారణకు ఆదేశించాలని సీఈసీని కోరారు.


More Telugu News