మీ మంత్రుల జాబితా సమర్పించండి: మోదీని కోరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- కేంద్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు దిశగా చర్యలు
- నేడు రాష్ట్రపతిని కలిసిన నరేంద్ర మోదీ
- నరేంద్ర మోదీని ప్రధానిగా నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
కేంద్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఎన్డీయే లోక్ సభా పక్ష నేత నరేంద్ర మోదీ నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. తనను లోక్ సభా పక్ష నేతగా ఎన్నుకున్న సందర్భంగా ఎన్డీయే కూటమి చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతికి అందజేశారు. తమకు మద్దతుగా నిలుస్తున్న వివిధ పార్టీల ఎంపీల జాబితాను కూడా రాష్ట్రపతికి సమర్పించారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రపతి భవన్ వర్గాలు సోషల్ మీడియా ద్వారా స్పందించాయి.
తనకున్న విశేష అధికారాల రీత్యా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(1) ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా నియమించారని వెల్లడించాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి... నరేంద్ర మోదీకి రెండు విజ్ఞప్తులు చేశారని ఆ వర్గాలు వివరించాయి.
1. కేంద్ర క్యాబినెట్ లో ఉండే మంత్రుల జాబితా సమర్పించండి. 2. రాష్ట్రపతి భవన్ లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమం తేదీ, సమయాన్ని తెలియజేయండి... అని మోదీని ముర్ము కోరారని రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి.
కాగా, మోదీ ఇవాళ రాష్ట్రపతిని కలిసిన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మోదీకి ముర్ము ఎంతో ఆప్యాయంగా స్వీట్ తినిపించారు.