మరో సీమా హైదర్.. పబ్జీ ప్రియుడిని వెతుక్కుంటూ భారత్‌కు అమెరికా యువతి
- గతంలో పాక్ నుంచి భారత్ వచ్చిన సీమా హైదర్
- ఇప్పుడు ఫ్లోరిడా నుంచి చండీగఢ్ వచ్చిన యువతి
- అక్కడే ఆమెను పెళ్లాడిన ప్రేమికుడు
- ఆపై భార్యతో కలిసి యూపీలోని స్వగ్రామానికి రాక
- అనుమానం వచ్చి పోలీసులకు గ్రామస్థుల సమాచారం
- అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు
సీమా హైదర్ గుర్తుందా? పబ్జీ ప్రేమికుడిని వెతుక్కుంటూ పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చి అతడినే పెళ్లి చేసుకుంది. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇప్పుడు ఇలాంటిదే మరో ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన బ్రూక్లిన్ (30) అనే యువతికి ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాకు చెందిన యువకుడు హిమాన్షు యాదవ్‌తో పబ్జీ ఆట ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది.
ప్రేమికుడిని కలుసుకునేందుకు బ్రూక్లిన్ కొన్ని నెలల క్రితం చండీగఢ్ చేరుకుంది. తన కోసం వచ్చిన ఆమెను కలుసుకునేందుకు హిమాన్షు చండీగఢ్ చేరుకున్నాడు. అక్కడే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు అక్కడే ఉండి ఆ తర్వాత ఇటావా చేరుకున్నారు.
విదేశీ యువతితో వచ్చిన హిమాన్షును చూసి అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసి ఇద్దరూ మళ్లీ చండీగఢ్ వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు. అయితే, అప్పటికే ఆ డ్రైవర్‌కు పోలీసుల నుంచి సమాచారం ఉండడంతో అతడు బస్సును నేరుగా పోలీస్ స్టేషన్ ముందు ఆపాడు. ఆ వెంటనే పోలీసులు హిమాన్షు, బ్రూక్లిన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం ఎస్పీ విజయ్‌సింగ్ మాట్లాడుతూ.. ఈ విషయంలో యువకుడి తప్పిదం ఏమీ లేదని, యువతి పూర్తి అంగీకారంతో వారి వివాహం జరిగిందని, ఇద్దరూ కలిసి చండీగఢ్ వెళ్లాలనుకోవడం కూడా ఆమె నిర్ణయమేనని తెలిపారు. దీంతో కథ సుఖాంతమైంది.