రాణించిన సూర్యకుమార్, పాండ్యా... టీమిండియా భారీ స్కోరు
- టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో టీమిండియా × ఆఫ్ఘనిస్థాన్
- బార్బడోస్ లోని కెన్సింగ్ టన్ ఓవల్ లో మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
టీ20 వరల్డ్ కప్ సూపర్-8 దశలో ఆఫ్ఘనిస్థాన్ తో పోరులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ అర్ధసెంచరీతో అలరించగా, హార్దిక్ పాండ్యా సమయోచితంగా ఆడాడు.
సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 53 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 32 పరుగులు చేశాడు. కోహ్లీ 24, పంత్ 20, అక్షర్ పటేల్ 12, శివమ్ దూబే 10 పరుగులు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో కెప్టెన్ రషీద్ ఖాన్ 3, ఫజల్ హక్ ఫరూఖీ 3, నవీనుల్ హక్ 1 వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న బార్బడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ మందకొడిగా ఉండడంతో బ్యాటింగ్ కష్టంగా మారింది. దాంతో టీమిండియా బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాట్లు ఝళిపించలేకపోయారు.