ముఖేశ్ అంబానీ కుటుంబ సభ్యులు ఎవరు ఏ పదవిలో...!
- రిలయన్స్ కు 1958లో బీజం వేసిన ధీరూభాయ్ అంబానీ
- ధీరూభాయ్ మృతి తర్వాత రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య విభజన
- రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ముఖేశ్ అంబానీ సారథ్యం
- కీలక పదవుల్లో ముఖేశ్ అంబానీ కుటుంబ సభ్యులు
రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్ లోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలకు రిలయన్స్ తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించింది. నాడు 1958లో ధీరూభాయ్ అంబానీ 'రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్' పేరిట నాటిన మొక్క... కాలక్రమంలో మహావృక్షంలా ఎదిగింది. రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ 1985లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా రూపాంతరం చెందింది.
ధీరూభాయ్ అంబానీ మృతి తర్వాత రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య విభజన జరిగింది. అందులో భాగంగా... రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ముఖేశ్ అంబానీ సారథ్యం వహిస్తున్నారు. ఇక ఆయన కుటుంబ సభ్యులు కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో వివిధ కీలక పదవుల్లో ఉన్నారు. వారు ఎవరెవరు ఏ పదవుల్లో ఉన్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.