లోక్ సభలో ప్రమాణం చివరలో జై పాలస్తీనా అన్న అసదుద్దీన్... తీవ్ర దుమారం

  • లోక్ సభలో ఎంపీగా అసదుద్దీన్ ప్రమాణం
  • జై భీమ్, జై మీమ్, జై తెలంగాణతో పాటు జై పాలస్తీనా అని నినాదాలు
  • నినాదంపై అధికార పక్షం అభ్యంతరం
  • తెలుగులో ప్రమాణం చేసిన కడియం కావ్య
  • ఇంగ్లీష్‌లో ధర్మపురి అర్వింద్, రఘురామిరెడ్డి ప్రమాణం
తెలంగాణకు చెందిన ఎంపీలు ఈరోజు లోక్ సభలో ప్రమాణం చేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం సభలో దుమారం రేపింది. ఆయన ప్రమాణంపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసదుద్దీన్ ప్రమాణం చేసిన తర్వాత చివరలో జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని నినాదాలు చేశారు. ఈ నినాదాలపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది.

వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలుగులో ప్రమాణం చేశారు. ప్రమాణం చివరలో కావ్య జై భీమ్, జై భద్రకాళి, సేవ్ కానిస్టిట్యూషన్ అని నానాదాలు చేశారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. చివరలో జై హింద్, జై తెలంగాణ, జై సంవిధాన్ అని నినదించారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు.

గోడం నగేశ్, అసదుద్దీన్ ఒవైసీ హిందీలో ప్రమాణం చేశారు. గడ్డం వంశీకృష్ణ, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. సురేశ్ షెట్కార్, ఈటల రాజేందర్, డీకే అరుణ, మల్లు రవి, కుందూరు రఘవీర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ తెలుగులో ప్రమాణం చేశారు. ఈటల జై సమ్మక్క సారలమ్మ అని నినదించారు.


More Telugu News