అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

  • ఎన్టీఆర్ జిల్లాలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం
  • బాయిలర్ పేలిన ఘటనలో ఒకరి మృతి
  • క్షతగాత్రులకు విజయవాడ మణిపాల్, ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స
  • అధికారులకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు
ఎన్టీఆర్ జిల్లా బోదవాడ వద్ద అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు అండగా నిలబడాలని అధికారులను ఆదేశించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడుకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, ప్రమాదానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

బాధిత కుటుంబాలకు  కంపెనీ నుంచి పరిహారం అందేలా చూడాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి కూడా సాయం అందిస్తామని తెలిపారు.

గాయపడిన కార్మికుల్లో ఒకరి మృతి

బోదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనలో 20 మంది గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు. వారంతా యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ కు చెందిన కార్మికులు. 

ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా, వారిలో ఒకరు మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తిని వెంకటేశ్ అనే కార్మికుడిగా గుర్తించారు. క్షతగాత్రులకు విజయవాడ మణిపాల్, ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.


More Telugu News