వారాన్ని భారీ లాభాలతో ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 24,500 దాటిన నిఫ్టీ

  • 622 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 186 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 6.68 శాతం పెరిగిన టీసీఎస్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 622 పాయింట్లు లాభపడి 80,519కి ఎగబాకింది. నిఫ్టీ 186 పాయింట్లు పెరిగి 24,502 వద్ద స్థిరపడింది. ఐటీ స్టాక్స్ అండతో మార్కెట్లు దూసుకుపోయాయి. అంచనాలకు మించి టీసీఎస్ లాభాలను ప్రకటించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. అమెరికా డాలరుతో పోలిస్తే మన రూపాయి విలువ రూ. 83.51గా ఉంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (6.68%), ఇన్ఫోసిస్ (3.57%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.20%), టెక్ మహీంద్రా (3.19%), యాక్సిస్ బ్యాంక్ (1.62%).

టాప్ లూజర్స్:
మారుతి (-1.00%), ఏసియన్ పెయింట్ (-0.79%), కోటక్ బ్యాంక్ (-0.77%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.56%), టైటాన్ (-0.55%).


More Telugu News