ఆ పోర్న్ వీడియోలు నిజమైనవే.. ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారణ

  • సంచలనం సృష్టించిన హసన్ పెన్‌డ్రైవ్ కుంభకోణం
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు, వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన సిట్
  • వీడియోల్లో ఎక్కడా కనిపించని పురుషుడు
  • వాటిలో కనిపించిన మహిళలను విచారించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిట్ రెడీ
  • విచారణను మరింత వేగవంతం చేయనున్న అధికారులు
సంచలనం సృష్టించిన జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసులో పోర్న్ వీడియోలు నిజమైనవేనని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు నిజమైనవేనని నిర్ధారించింది. సోషల్ మీడియాలో ప్రచారం కావడానికి ముందు ఈ వీడియోలను ఎడిట్ చేయడం కానీ, మార్ఫింగ్ చేయడం కానీ చేయలేదని స్పష్టం చేసింది. గ్రాఫిక్స్ కానీ, యానిమేషన్ కానీ ఉపయోగించలేదని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ తేల్చి చెప్పింది.

హసన్ పెన్‌డ్రైవ్ కేసుకు సంబంధించి సిట్ సోషల్ మీడియా, పెన్‌డ్రైవ్‌ల నుంచి ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి పలు వీడియోలను సేకరించింది. అనంతరం వీటిని ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపింది. ఈ వీడియోల్లో ఎక్కడా పురుషుడు కనిపించలేదు. మహిళలే కనిపించారు. ఈ నేపథ్యంలో వారిని విచారించి మరిన్ని ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. 

కాగా, హసన్ పెన్‌డ్రైవ్ కుంభకోణం బయటపడి మూడు నెలలైంది. ప్రజ్వల్ అరెస్ట్ అయి దాదాపు రెండు నెలలు అవుతోంది. మరో నిందితుడు హెచ్‌డీ రేవణ్ణకు కోర్టు ఇప్పటికే బెయిలు మంజూరు చేసింది. దీంతో దర్యాప్తును మరింత వేగవంతం చేసి చార్జ్‌షీట్ వేసేందుకు సిట్ అవసరమైన సన్నాహాలు చేస్తోంది.


More Telugu News