సన్నగా ఉన్నవారు సడన్‌‌గా బరువు పెరుగుతున్నారా? అయితే కారణాలు ఇవే కావొచ్చు!

కొందరు ఉన్నట్టుండి బరువు పెరిగిపోతుంటారు. ఆకస్మికంగా శరీరంలో మార్పులు వస్తుంటాయి. నెలల వ్యవధిలోనే గణనీయంగా కొన్ని కేజీల మేర పెరిగి లావై పోతుంటారు. మనుషులు క్రమక్రమంగా బరువు పెరిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఉన్నట్టుండి బరువు పెరగడం మొదలైతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశం ఉంటుంది. అందుకే శరీరంలో సడెన్‌గా చోటుచేసుకునే బరువు పెరుగుదలపై అవగాహన ఉండడం చాలా ముఖ్యం. 

ఆకస్మికంగా అధిక బరువు పెరగడానికి తీసుకునే ఆహారమే కారణమని చాలామంది భావిస్తుంటారు. తిండిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే అకస్మాత్తుగా బరువు పెరగడానికి అనేక ఇతర అంశాలు కారణం కావొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిపై అవగాహన చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. మరి ఉన్నట్టుండి బరువు పెరగడానికి గల కారణలను ‘ఏపీ7ఏఎం’ వీడియో రూపంలో అందించింది. వీడియోను పూర్తిగా వీక్షించి విలువైన ఈ సమాచారాన్ని మీరు కూడా తెలుసుకోండి.


More Telugu News