బంగ్లాదేశ్ పరిణామాలపై స్పందించిన తెలంగాణ డీజీపీ
- అక్కడి పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌లో నిఘా పెట్టామన్న డీజీపీ
- అక్రమంగా ఎవరైనా వస్తే చర్యలు ఉంటాయని స్పష్టీకరణ
- ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్య
బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌లో గట్టి నిఘా పెట్టినట్లు చెప్పారు. నగరంలోని బంగ్లా దేశీయులపై నిఘా ఉంచామన్నారు. బంగ్లాదేశ్ నుంచి నగరానికి ఎవరైనా అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారం నడుచుకుంటామన్నారు.
ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత
ప్రజల భద్రత, రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు. రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో, డేటా సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాకథాన్ 2024 కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రస్తుతం డిజిటల్ సైబర్ సెక్యూరిటీ ప్రధానంగా మారిందని తెలిపారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు అయినప్పటి నుంచి ఎన్నో కేసులను ఛేదించామన్నారు. సైబర్ నేరగాళ్ల నుంచి నగదును రికవరీ చేసి బాధితులకు ఇచ్చామన్నారు. గత ఏడాదిలో సైబర్ క్రైమ్ కారణంగా డబ్బులు కోల్పోయిన బాధితులకు రూ.150 కోట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా తిరిగి ఇచ్చామన్నారు.