కోల్‌క‌తా హ‌త్యాచార ఘ‌ట‌న‌... తీవ్రంగా క‌లిచివేసింది: రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము

  • యావ‌త్ దేశాన్ని క‌దిలించిన కోల్‌క‌తా ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచార ఘ‌ట‌న
  • అదో భ‌యాన‌క ఘ‌ట‌న అన్న రాష్ట్ర‌ప‌తి
  • మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దారుణాల‌కు ఇక‌నైనా అడ్డుక‌ట్ట‌వేయాలన్న ద్రౌప‌ది
కోల్‌క‌తా ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచార ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని క‌దిలించింది. దీంతో బాధితురాలికి మ‌ద్ద‌తుగా దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. తాజాగా ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము స్పందించారు. ఈ ఘ‌ట‌న‌పై ఆమె తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

ఈ ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌లిచివేసింద‌న్న రాష్ట్ర‌ప‌తి...  అదో భ‌యాన‌క ఘ‌ట‌న అని పేర్కొన్నారు. అక్కాచెల్లెళ్లు, కుమార్తెలు ఇలాంటి దారుణాల‌కు గురికావ‌డాన్ని ఏ నాగ‌రిక స‌మాజం అనుమ‌తించ‌బోద‌న్నారు. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాల‌కు ఇక‌నైనా అడ్డుక‌ట్ట‌వేయాల‌ని చెప్పారు. పీటీఐ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కోల్‌క‌తా ఘ‌ట‌న‌పై స్పందిస్తూ రాష్ట్ర‌ప‌తి ఈ వ్యాఖ్య‌లు చేశారు.


More Telugu News