ఏపీ ప్రభుత్వం ఏం చేయాలో అదే చేస్తోంది: నారా భువనేశ్వరి

  • ఏపీలో వరద పరిస్థితులు
  • ప్రకృతి విపత్తులను ఆపడం మన చేతుల్లో ఉండదన్న నారా భువనేశ్వరి
  • వేగంగా స్పందించి ప్రజలను అప్రమత్తం చేస్తే ఆస్తి, ప్రాణనష్టం తగ్గించవచ్చని వెల్లడి
  • ఏపీ ప్రభుత్వం ఆ దిశగానే ముందుకు వెళుతోందని స్పష్టీకరణ 
రాష్ట్రంలో వరద పరిస్థితులు, సీఎం చంద్రబాబు అహోరాత్రాలు సమీక్షలు చేపడుతూ, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న తీరు పట్ల ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి స్పందించారు. 

ప్రకృతి విపత్తులను ఆపడం మన చేతుల్లో ఉండదని... కాకపోతే అలాంటి సమయాల్లో వేగంగా స్పందించి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సహాయక చర్యలు అందిస్తే... ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించుకోవచ్చని, బాధితులకు భరోసా కల్పించవచ్చని సూచించారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అదే చేస్తోందని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. 

"ముఖ్యమంత్రి అయ్యుండి చంద్రబాబు గారు స్వయంగా బాధితుల వద్దకు వెళ్లారు. బాధితులకు ఆహారం, నీరు అందించి ధైర్యం చెప్పారు. సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాల్లోనూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా తన వంతు సాయంగా రంగంలోకి దిగుతోంది. ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలవాలని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాను. 

దాంతోపాటే వాలంటీర్స్ తమ వంతు సహాయం చేయాలని అని కోరుతున్నాను" అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.


More Telugu News