విశాఖ స్టీల్ ప్లాంట్ ను ధ్వంసం చేయాలన్న ఆలోచన కేంద్రానికి లేదు: పురందేశ్వరి

  • విశాఖ స్టీల్ ప్లాంట్ పై స్పందించిన పురందేశ్వరి
  • ప్లాంట్ ను లాభాల బాటలోకి తీసుకురావాలన్నదే కేంద్రం యోచన అని వెల్లడి
  • కేంద్రమంత్రి కుమారస్వామి కూడా సానుకూలంగా స్పందించినట్టు వివరణ
విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం వైఖరి ఏమిటన్నది ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ధ్వంసం చేయాలని కేంద్రం భావించడంలేదని స్పష్టం చేశారు. అభివృద్ధి చేయాలనే ఆలోచన తప్ప, ధ్వంసం చేయాలనే ఆలోచన కేంద్రానికి  లేదని అన్నారు. 

ఉక్కు పరిశ్రమను పరిరక్షించి, లాభాల బాటలోకి తీసుకురావాలన్నదే కేంద్రం యోచన అని వివరించారు. కేంద్రమంత్రి కుమారస్వామి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించారని, ఆయన కూడా పరిశ్రమ పట్ల సానుకూలంగా స్పందించారని పురందేశ్వరి వివరించారు. రాజమండ్రిలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News