చార్మినార్‌పై ప్రమాదకరంగా నడిచిన వ్యక్తి... నెట్టింట వీడియో వైరల్!
- చార్మినార్ చివరి అంతస్తులో నిలబడి.. వ్యక్తి ప్రమాదకర స్టంట్
- ఒక కిటికీ నుంచి మరో కిటికీని పట్టుకొని ప్రమాదకరంగా నడిచిన వైనం
- కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్ అంటే మనకు మొదట గుర్తొచ్చే చారిత్రాత్మక కట్టడం చార్మినార్. ఆ చార్మినార్‌పై ఎక్కిన ఓ వ్యక్తి తాజాగా సాహసపూరిత చర్యకు పాల్పడ్డాడు. చార్మినార్ చివరి అంతస్తులో నిలబడి.. ప్రమాదకరమైన స్టంట్ చేశాడు.
ఒక కిటికీ నుంచి మరో కిటికీని పట్టుకొని డేంజరస్‌గా నడిచాడు. అతడు అలా సాహసం చేయడాన్ని ఎవరో వీడియో తీసి నెట్టింట పెట్టారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయింది.
ఇక వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి ఇలా ప్రమాదకరంగా నడవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అసలు ఆ వ్యక్తి ఎవరు? చివరి అంతస్తు వరకు వెళ్లేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు? అలా ప్రమాదకరంగా నడవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలా రకరకాల ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, ఈ ఘటన స్థానిక పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు స్పందించారు. చార్మినార్ వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఆ నిర్మాణ పనులు చేస్తున్న కార్మికుల్లో అతడు ఒకరై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.