వాంగ్మూలం తీసుకుంటామని చెప్పినా మళ్లీ సమయం ఎలా కోరుతారు?: కేటీఆర్‌కు కోర్టు ప్రశ్న
- కొండా సురేఖపై పరువు నష్టం కేసులో ఈ రోజు వాంగ్మూలం నమోదు చేస్తామన్న కోర్టు
- అనివార్య కారణాల వల్ల కేటీఆర్ హాజరు కాలేకపోయారన్న న్యాయవాది
- బుధవారం స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తామని స్పష్టం చేసిన కోర్టు
వాంగ్మూలం తీసుకుంటామని చెప్పినప్పటికీ మళ్లీ సమయం ఎలా కోరుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నాంపల్లి కోర్టు ప్రశ్నించింది. మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు కేటీఆర్ సహా సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని తెలిపింది. అయితే కేటీఆర్ కోర్టుకు హాజరు కాలేదు.
అనివార్య కారణాల వల్ల కేటీఆర్ ఈరోజు వాంగ్మూలం నమోదు చేయడానికి కోర్టుకు హాజరు కాలేపోతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. వాంగ్మూలం నమోదు చేయడానికి సమయం ఇవ్వాలని కోరారు. సోమవారం లేదా బుధవారం సమయం ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలోనే... ఈరోజు వాంగ్మూలం తీసుకుంటామని చెప్పినప్పటికీ మళ్లీ సమయం కోరడమేమిటని కోర్టు ప్రశ్నించింది. అనంతరం బుధవారం కేటీఆర్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తామని స్పష్టం చేసింది.