గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

  • తెలంగాణలో నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్
  • వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
  • అభ్యర్థులు ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలన్న రేవంత్ రెడ్డి
తెలంగాణలో నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు వాయిదా వేయాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో, పరీక్షలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. 

ఇవాళ్టి నుంచి జరుగుతున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఎటువంటి ఆందోళన చెందకుండా పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయండి అని సూచించారు. 

ఈ పరీక్షల్లో మీరు విజయం సాధించి తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని రేవంత్ రెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు.


More Telugu News