కేటీఆర్‌పై ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసు నమోదుకు ఫిర్యాదు!
- అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు
- ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం చుట్టూ కట్టిన గోడను కూల్చేసిన బీఆర్ఎస్ నేతలు
- ఉద్దేశపూర్వకంగానే గోడను కూల్చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్న కాంగ్రెస్ నేతలు
- ఇందుకు ప్రధాన కారణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరేనని వ్యాఖ్య
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసు నమోదు కోసం కాంగ్రెస్ నేతలు అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్‌కు ఫిర్యాదు చేశారు. ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం చుట్టూ కట్టిన గోడను బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగానే కూల్చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు ప్రధాన కారణం కేటీఆరేనని ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.
ఇలాంటి ఘటనలు అల్లర్లకు కారణమయ్యే అవకాశం ఉందని, దేశ సమగ్రతను దెబ్బతీస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేటీఆర్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఆ పార్టీ కీలక నేత మన్నె క్రిశాంక్, బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్, కేటీఆర్ పీఏ తిరుపతిపై ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మేరకు రాష్ట్ర ఎస్‌సీ సెల్ అధ్యక్షుడు ప్రీతం, మత్స్య కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి, తెలంగాణ ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఇరవర్తి అనిల్ కలిసి అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్‌పై పోలీసులు ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తారా? లేదా? అనే విషయమై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.