రివ్యూలు రాసే వారికి క్షమాపణలు చెబుతాను... నటుడు శ్రీకాంత్ అయ్యంగార్
- పొట్టేల్ సినిమా సక్సెస్ మీట్లో రివ్యూలు రాసేవారిపై శ్రీకాంత్ అయ్యంగార్ విమర్శలు
- 'మా'కు ఫిర్యాదు చేసిన సినీ క్రిటిక్స్ అసోసియేషన్
- తన మాటలు కొందరికి బాధ కలిగించాయని, సారీ చెబుతానని వెల్లడి
సినిమా రివ్యూలు రాసే వారిపై తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలకు గాను త్వరలో క్షమాపణలు చెబుతానని ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశాడు. పొట్టేల్ సినిమా సక్సెస్ మీట్లో రివ్యూలు రాసేవారిపై ఆయన విమర్శలు గుప్పించాడు. ఈ సినిమా సక్సెస్ మీట్లో తాను కొన్ని మాటలు మాట్లాడానని, రివ్యూలు రాసే కొందరికి బాధ కలిగించానని, సరైన అంశాలపై త్వరలో క్షమాపణ చెబుతానని వెల్లడించారు. దయచేసి వేచి ఉండండని విజ్ఞప్తి చేశారు.
ఇటీవల శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ... సినిమాను ఎలా రూపొందించాలో తెలియని వారు రివ్యూలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాంటి వారి సినిమా సమీక్షలు ఆపేయాలని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. అలాగే సినీ క్రిటిక్స్ అసోసియేషన్ 'మా' అధ్యక్షుడు మంచు విష్ణుకు పిర్యాదు చేసింది. రివ్యూలు రాసే వారి మనోభావాలు దెబ్బతీసేలా శ్రీకాంత్ వ్యాఖ్యలు ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.