విజయసాయిరెడ్డి ట్వీట్ పై సోమిరెడ్డి సెటైర్

  • నేను కేంద్రమంత్రినైతే అంటూ ట్వీట్ చేసిన విజయసాయి
  • పరిశ్రమల లాభాల్లో కార్మికుల కూడా వాటా ఇస్తానని వెల్లడి
  • విజయసాయి కేంద్రమంత్రి అయితే రాష్ట్రంలో ఇంకేమీ మిగలదన్న సోమిరెడ్డి 
విజయసాయిరెడ్డి ట్వీట్ పై సోమిరెడ్డి సెటైర్
రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అన్న కాదు... శకుని... జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి, నేను కేంద్రమంత్రి అయితే కార్మికులకు కూడా సంస్థ లాభాల్లో వాటా ఇస్తానంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్ వేశారు. 

ఏందయ్యా విజయసాయిరెడ్డా... ఉత్త ఎంపీ అయితేనే మీరు, మీ వియ్యంకుడు సగం రాష్ట్రాన్ని దోచేశారు... ఇక కేంద్రమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఇంకేం మిగులుద్ది? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

అయినా, ఇంకా వైసీపీ బతికి బట్టకడుతుందని మీకు ఆశ ఉందా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. మొన్న కన్నతల్లే జగన్ రెడ్డి బతుకు బయటపెట్టిన తర్వాత కూడా ఇంకా ఎక్కడుందయ్యా మీ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. 



More Telugu News