ఆ సినిమా ఆ ఇంట్లో తీశాము .. అది కూలుస్తుంటే ఎంతో బాధేసింది: దర్శకుడు వంశీ
- తాను ఎక్కువగా తిరుగుతూ ఉంటానన్న వంశీ
- గతంలో తాను షూట్ చేసిన ప్రదేశాలకు వెళుతుంటానని వెల్లడి
- గత జ్ఞాపకాలు తనకి ఉత్సాహాన్నిస్తాయని వ్యాఖ్య
- 'శివకోడు'లో ఆ సినిమా షూటింగు చేశామని వివరణ
- ఆ రోజంతా అక్కడే ఉండిపోయానని ఆవేదన
దర్శకుడు వంశీ సినిమాలు ఒక ప్రత్యేకమైన కేటగిరీకి చెందినవనే చెప్పాలి. గ్రామీణ నేపథ్యం .. అడవి నేపథ్యంలో ఆయన కథలు పరిగెడుతూ ఉంటాయి. కథ ఏదైనా అందులో గోదావరి కనిపించవలసిందే. ఆ గోదావరితో ఆయనకి ఉన్న అనుబంధం అలాంటిది. అలాంటి వంశీ తాజాగా 'సాక్షి'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించిన అనేక విషయాలను పంచుకున్నారు.
" సాధారణంగా నేను ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటాను. నేను ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు, గతంలో నేను షూటింగు చేసిన ప్రదేశాలలో తిరుగుతూ ఉంటాను. ఆ రోజున ఇక్కడ ఇలా జరిగింది కదా .. ఫలానా చోటున ఫలానా షాట్ తీశాను గదా అని గుర్తుచేసుకుంటాను. అలా ఈ మధ్య కాలంలో నేను రాజోలు దగ్గరున్న 'శివకోడు' అనే ఊరు వెళ్లాను. అక్కడ గతంలో నేను 'శ్రీకనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్' సినిమా షూటింగు చేశాను" అని అన్నారు.
"ఆ ఊళ్లో అప్పట్లో పాతకాలం నాటి బిల్డింగ్ ఒకటి ఉండేది. అందులో ఆ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్ ను షూట్ చేశాము. మొన్న నేను ఆ గ్రామానికి వెళ్లేసరికి ఆ డాబాను కూల్చేస్తున్నారు. అది చూడగానే నాకు చాలా బాధగా అనిపించింది. ఆ రోజు సాయంత్రం వరకూ అక్కడే ఉండిపోయాను. ఆ డాబాకు సంబంధించిన ఫొటోలను వరసగా తీస్తూ నుంచుండిపోయాను" అని చెప్పారు.