'పుష్ప-2' నుంచి మరో ఎనర్జీ అప్‌డేట్‌ వచ్చేసింది!

  •  టాక్‌ ఆఫ్‌ ద ఇండియాగా మారిన 'పుష్ప-2' ట్రైలర్‌  
  • అల్లు అర్జున్‌ - శ్రీలీలపై చిత్రీకరించిన 'కిస్సిక్‌' పాట 
  • చెన్నయ్‌లో ఈ నెల 24 న 'కిస్సిక్‌' పాట విడుదల
ఇటీవల బీహార్‌లోని పాట్నాలో జరిగిన ట్రైలర్‌ విడుదల వేడుకతో ఇండియా మొత్తం హాట్‌టాపిక్‌గా మారిన 'పుష్ప-2' ది రూల్‌ నుంచి ఎటువంటి అప్‌డేట్‌ వచ్చినా అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది. ముఖ్యంగా పాట్నాలో జరిగిన ట్రైలర్‌ విడుదల వేడుకకు రెండున్నర లక్షల మంది హాజరు కావడం, వేడుక జనసంద్రంలా మారటం, నార్త్‌ ఇండియాలో తెలుగు హీరోకు పట్టిన నీరాజనం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 

ఆ క్రెడిట్‌ అంతా పుష్ప-2 బ్రాండ్‌తో పాటు అల్లు అర్జున్‌కు నార్త్‌ ఇండియాలో ఉన్న క్రేజ్‌ ప్రదాన కారణమని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఆ వేడుకలో విడుదలైన ట్రైలర్‌కు వచ్చిన అప్లాజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫుల్‌ మాసివ్‌ ఉన్న ఆ ట్రైలర్‌ యూనివర్శల్‌గా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. 

డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంపై ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది. కాగా తాజాగా ఈ చిత్రం నుంచి గురువారం మరో అప్‌డేట్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌- శ్రీలీలపై చిత్రీకరించిన 'కిస్సిక్‌' అనే పత్యేకపాటను ఈ నెల 24న చెన్నయ్‌లో జరుగనున్న వేడుకలో విడుదల చేస్తున్నట్లుగా నిర్మాతలు తెలియజేశారు. 

'పుష్ప ది రైజ్‌' లో అల్లు అర్జున్‌, సమంతలపై చిత్రీకరించిన 'ఊ అంటావా.. మామ.. ఊఊ.. అంటావా మామ'  పాట ఎంత పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. తాజాగా 'పుష్ప-2' కోసం చిత్రీకరించిన 'కిస్సిక్‌' సాంగ్‌ దానికి మించిన విధంగా ఉంటుందని చిత్ర యూనిట్‌ చెబుతున్నారు. 

డ్యాన్సుల్లో తనకంటూ ఓ పత్యేకత కలిగిన అల్లు అర్జున్‌, డ్యాన్స్‌ క్వీన్‌గా పేరు పొందిన శ్రీలీల కాంబినేషన్‌లో సాంగ్‌.. అదీ సుకుమార్‌ దర్శకత్వంలో అంటే ఇక ఆ పాట ఎంత మాసివ్‌గా ఉంటుందో అంచనా వేసుకోవచ్చు... ఇక ఇద్దరి ఫైర్‌తో కూడిన పాట ఎలా ఉంటుందో చూడాలంటే ఈ నెల 24 వరకు ఆగాల్సిందే..! 

,


More Telugu News