సాయి పల్లవి 'బుజ్జి తల్లి' సాంగ్ విడుదల
- 'తండేల్' చిత్రం నుంచి 'బుజ్జి తల్లి' సాంగ్ రిలీజ్
- నాగచైతన్య-సాయి పల్లవి జంటగా 'తండేల్'
- వినసొంపైన బాణీలతో... క్యాచీ లిరిక్స్‌తో రూపొందిన పాట
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'తండేల్'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లవ్ స్టోరీ' తరువాత మళ్లీ ఈ జంట నటిస్తున్న రెండో చిత్రమిది. మత్స్యకారుల జీవన నేపథ్యంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ డ్రామాకు చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన యధార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందింది.
ఫిబ్రవరి 7న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రం ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా ఈ చిత్రంలోని ఫస్ట్ లిరికల్ వీడియో 'బుజ్జి తల్లి' పాటను గురువారం విడుదల చేశారు. ఈ పాటలో సాయి పల్లవి, నాగచైతన్య జంట మధ్యలో ఉన్న ఎమోషనల్ జర్నీ కనిపిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ పాటలో ఆయన తనదైన మార్క్‌ని చూపించాడు. బాధలో ఉన్న ప్రియురాలిని ఓదార్చడానికి... అక్కున చేర్చుకోవడానికి చేసే ప్రయత్నంలో ఈ పాట వస్తుందని సిట్యుయేషన్ చూస్తే తెలిసిపోతుంది. శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ పాటలో చాలా చక్కని తెలుగు పదాలు ఉన్నాయి. హీరో భావోద్వేగాలను ఆ పదాలు కవితాత్మకంగా వ్యక్తీకరించాయి.
జావేద్ అలీ సోల్‌ఫుల్ వోకల్స్ ఈ పాటకు మరింత వన్నె తెచ్చాయి. స్క్రీన్‌పై నాగచైతన్య, సాయి పల్లవిల జోడి ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక ఈ బుజ్జి తల్లి పాట 'సాంగ్ ఆఫ్ ద ఇయర్' గా నిలబడుతుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ బుజ్జితల్లి వీడియో సాంగ్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి..!