లివర్ డ్యామేజీకి కారణం... ఈ ఆహార అలవాట్లే!
- కాలేయం దెబ్బతింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు
- కొన్ని రకాల ఆహారం, అలవాట్ల వల్ల కాలేయంపై తీవ్ర ఒత్తిడి
- అందువల్ల ఆయా అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటున్న ఆరోగ్య నిపుణులు
మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. దాని పనితీరులో ఏ మాత్రం మార్పు వచ్చినా... మన మొత్తం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆహారం అరగకపోవడం నుంచి కామెర్లు, ఇతర ఎన్నో వ్యాధులు దీనితో తలెత్తుతాయి. అలాంటి కాలేయం దెబ్బతినడానికి మన ఆహార అలవాట్లు కూడా కారణం అవుతాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు, వాటిని మనం తీసుకునే తీరు వల్ల లివర్ సిర్రోసిస్ వంటి సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహార అలవాట్లు ఏమిటో తెలుసుకుందామా...
అత్యధిక కొవ్వు ఉండే ఆహారం
జంక్ ఫుడ్, ఫ్రై చేసిన ఆహారం, కొవ్వులు, నూనెలు విపరీతంగా ఉండే ఆహారం వల్ల కాలేయంపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఇది ఫ్యాటీ లివర్ డిసీజ్ కు దారితీస్తుంది.
కూల్ డ్రింక్స్, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు
చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్, ఇతర పానీయాల వల్ల ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తుతుంది. శరీరంలో ఇన్సూలిన్ రెసిస్టెన్స్ పెరిగి... అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, ఒబేసిటీ వంటి సమస్యలు వస్తాయి.
విపరీతంగా ఆల్కాహాల్ తీసుకోవడం
తరచూ, పరిమితికి మించి ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్, ఆల్కహాలిక్ హెపటైటిస్, సిర్రోసిస్ వంటి వ్యాధులు వస్తాయి. శరీరం బలహీనం అయిపోతుంది. బరువు తగ్గిపోతారు. అలవాటు మరీ ఎక్కువైతే... కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది.
ప్రాసెస్ చేసిన ఆహారం...
తాజా ఆహార పదార్థాలు కాకుండా ప్రాసెస్ చేసిన మాంసం, ఇతర ఆహార పదార్థాల్లో అత్యధిక స్థాయుల్లో ట్రాన్స్ ఫ్యాట్, పలు రకాల రసాయన పదార్థాలు ఉంటాయి. ఇవి లివర్ వాపునకు కారణమై... పనితీరును దెబ్బతీస్తాయి.
హై సోడియం ఆహారం...
ఉప్పు (సోడియం) ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల వల్ల శరీరంలో ద్రవ పదార్థాల నిర్వహణపై ప్రభావం పడుతుంది. రక్తపోటు పెరుగుతుంది. ఇవి కాలేయంపై ఒత్తిడి పెంచి పనితీరును దెబ్బతీస్తాయి.
సరిగా ఉడకని మాంసాహారం
మాంసాహారం అంటేనే వివిధ రకాల సూక్ష్మజీవులకు నిలయం. సరిగా ఉడకని మటన్, చికెన్, గుడ్లు, చేపలు వంటి ఆహారం తీసుకున్నప్పుడు కొన్నిరకాల బ్యాక్టీరియాలు, వైరస్ లు శరీరంలోకి చేరుతాయి. అవి లివర్ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తాయి.
అతిగా విటమిన్, ప్రోటీన్ ట్యాబ్లెట్లు, పౌడర్లు తీసుకోవడం
బలహీనంగా ఉన్నామనో, వ్యాయామం చేస్తూ కండలు పెంచడానికో, లావు కావాలన్న ఉద్దేశంతోనో కొందరు పరిమితికి మించి విటమిన్, ప్రొటీన్ ట్యాబ్లెట్లు, పౌడర్లు తీసుకుంటూ ఉంటారు. ఇవి కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతిస్తాయి.
బరువు తగ్గేందుకు వాడే మందులు, తీవ్రమైన డైటింగ్
బరువు తగ్గేందుకు వాడే కొన్ని రకాల మందులు శరీరంలో కొవ్వు కణాల నుంచి విష పదార్థాలు వెలువడేందుకు కారణమవుతాయి. అవి కాలేయాన్ని దెబ్బతీస్తాయి. ఇక విపరీతమైన డైటింగ్ వల్ల కాలేయానికి అవసరమైన పోషకాలు అందక పనితీరు దెబ్బతింటుంది.
రాత్రి ఆలస్యంగా, అతిగా తినడం
తరచూ రాత్రి పూట ఆలస్యంగా తినడం, అదీ కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కాలేయంపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఇది అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్ కు కూడా దారి తీస్తుంది.
వేగంగా, సరిగా నమలకుండా తినడం
ఆహారాన్ని వేగంగా, సరిగా నమలకుండా తినడం కూడా సమస్యాత్మకమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆహారం సరిగా జీర్ణంగాక... కాలేయంపై ప్రభావం పడుతుందని, ఫ్యాటీ లివర్ వంటి సమస్య తలెత్తుతుందని స్పష్టం చేస్తున్నారు.