నారా లోకేశ్ తో చాగంటి కోటేశ్వరరావు భేటీ
- విద్యార్థుల నైతిక విలువల సలహాదారుగా చాగంటి నియామకం
- లోకేశ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చాగంటి
- మీ వంటి పెద్దల సలహాలు అవసరమని చాగంటిని కోరిన లోకేశ్
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థుల నైతిక విలువల సలహాదారుగా ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో చాగంటి కోటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విద్యార్థులకు సంబంధించిన విషయాలపై వీరు చర్చించుకున్నారు.
ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ... మహిళలు, పెద్దలు, గురువులపై విద్యార్థుల్లో గౌరవం పెంపొందించేలా ప్రత్యేకంగా పాఠ్యాంశాలను రూపొందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనికోసం మీ వంటి పెద్దల అమూల్యమైన సలహాలు అవసరమని చాగంటికి చెప్పారు. దీనికి సమాధానంగా... విద్యార్థుల్లో సత్ప్రవర్తన, నైతిక విలువలను పెంపొందించేందుకు తన వంతు సలహాలు, సహకారం అందిస్తానని చాగంటి తెలిపారు.