రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగతంగా హాజరుకాబోరు: ఏపీ పోలీసులకు లీగల్ టీం వెల్లడి

  • రామ్ గోపాల్ వర్మ వర్చువల్‌ విచారణకు హాజరవుతారన్న లీగల్ టీం
  • చట్టం ప్రకారం వర్చువల్‌గా హాజరు కావొచ్చని వెల్లడి
  • అరెస్ట్ చేస్తే చట్ట ప్రకారం ఎదుర్కొంటామన్న లీగల్ టీం
రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాలేడని, వర్చువల్ విచారణకు మాత్రం హాజరవుతారని ఆయన లీగల్ టీమ్ ఏపీ పోలీసులకు తెలిపింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వచ్చిన విషయం తెలిసిందే. ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో విచారణ నిమిత్తం ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే వర్మ రాకపోవడంతో పోలీసులు హైదరాబాద్ వచ్చారు.

ఆయనను అదుపులోకి తీసుకోవచ్చని ఉదయం నుంచి ప్రచారం సాగింది. కానీ సెర్చ్ వారెంట్ లేకపోవడంతో వర్మ నివాసం లోనికి వెళ్లలేకపోయారు. ఉదయం నుంచి వేచి చూసిన ఏపీ పోలీసులు సాయంత్రం జుబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 71లోని ఆర్జీవీ డెన్ నుంచి వెళ్లిపోయారు. 

ఈ అంశంపై ఆర్జీవీ లీగల్ టీమ్ స్పందించింది. బీఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం వర్చువల్‌గా హాజరయ్యేందుకు అవకాశం ఉందని రామ్ గోపాల్ వర్మ లీగల్ టీమ్ తెలిపింది. నేరుగా ఆయనను అరెస్ట్ చేస్తే చట్ట ప్రకారం ఎదుర్కొంటామని తెలిపింది.


More Telugu News