ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ... నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాల ప్రభావం
- 105 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 27 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. దీనికి తోడు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాలను చవిచూశాయి.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 105 పాయింట్లు నష్టపోయి 80,004కి పడిపోయింది. నిఫ్టీ 27 పాయింట్లు కోల్పోయి 24,194 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 84.33గా ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (1.79%), ఇన్ఫోసిస్ (1.73%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (1.11%), టీసీఎస్ (0.85%), రిలయన్స్ (0.60%).
టాప్ లూజర్స్:
అదానీ పోర్ట్స్ (-3.23%), అల్ట్రాటెక్ సిమెంట్ (-3.07%), సన్ ఫార్మా (-2.48%), ఎన్టీపీసీ (-1.90%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.87%).