టీమిండియాకు భారీ షాక్.. రెండో టెస్టుకు కూడా స్టార్ ప్లేయర్ దూరం..!
- బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా రెండో టెస్టు
- ఈ మ్యాచ్‌కు భారత స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ దూరమయ్యే అవకాశం
- బొటనవేలు గాయం కారణంగా పెర్త్ టెస్టుకు దూరమైన గిల్
- యువ ఆటగాడికి మరో 10-14 రోజుల విశ్రాంతి ఇవ్వాలని వైద్య నిపుణుల సూచన
- దాంతో అడిలైడ్‌లో కూడా అతడు ఆడే విషయంలో అనిశ్చితి నెలకొందని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' కథనం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి ఆసీస్‌తో భారత్ రెండో టెస్టు ఆడనుంది. అయితే, ఈ పింక్‌బాల్ టెస్టు (డేనైట్)కు భారత స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ వార్త ఇప్పుడు టీమిండియా వర్గాలను కలవరపెడుతోంది. ఇప్పటికే బొటనవేలు గాయం కారణంగా గిల్ మొదటి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే.
ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు యువ ఆటగాడికి మరో 10 నుంచి 14 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచించినట్లు సమాచారం. అడిలైడ్ ఓవల్‌లో టెస్టుకు ముందు, భారత జట్టు శనివారం కాన్‌బెర్రాలో పింక్-బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు గిల్ తప్పుకోవడం ఖాయం. దాంతో అడిలైడ్‌లో కూడా అతడు ఆడే విషయంలో అనిశ్చితి నెలకొందని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పేర్కొంది.
"బొటనవేలు గాయం కారణంగా గిల్‌కి వైద్య నిపుణులు 10-14 రోజుల విశ్రాంతి సూచించారు. దాంతో అతను వారాంతంలో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడడు. ప్రస్తుతానికి రెండో టెస్టు కూడా ఆడటం సందేహమే. అతని గాయం తీవ్రత ఎంత అనేది చూడాలి. గిల్ వేలి గాయం నయం అయిన తర్వాత కూడా అతనికి టెస్ట్ మ్యాచ్ ఆడే ముందు మంచి ప్రాక్టీస్ అవసరం" అని టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది.
మరోవైపు కుమారుడు పుట్టడంతో పితృత్వ సెలవుల్లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. అయితే, రోహిత్ రెండో టెస్టుకు జట్టుతో చేరనున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న ఆయన ప్రాక్టీస్ కూడా మొదలెట్టాడు. దేవదత్ పడిక్కల్ స్థానంలో అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టులో హిట్‌మ్యాన్ భారత ప్లేయింగ్ ఎలెవన్‌లోకి అడుగుపెట్టనున్నాడు.