ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. నెం.01 బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా.. జైస్వాల్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్!
- పెర్త్ టెస్టులో 8 వికెట్లతో రాణించిన జస్ప్రీత్ బుమ్రా
- ఈ ప్రదర్శన కారణంగానే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం
- కగిసో రబాడ, హేజిల్‌వుడ్‌ను దాటేసి టాప్ ర్యాంక్
- బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌కు రెండో ర్యాంక్
ఐసీసీ బుధవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో నిలిచాడు. పెర్త్ టెస్టులో 8 వికెట్లు తీసి భారత్‌కు 295 పరుగుల తేడాతో బంపర్ విక్టరీని అందించాడీ ఫాస్ట్ బౌలర్. ఈ అద్భుత ప్రదర్శన కారణంగానే బుమ్రా నెం.01 బౌలర్‌గా నిలిచాడు. కగిసో రబాడ, జోష్ హేజిల్‌వుడ్‌ను దాటేసి టాప్ ర్యాంక్‌కు దూసుకెళ్లాడు.
అటు టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారీ సెంచరీతో అలరించిన యశస్వి జైస్వాల్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. మనోడు ఏకంగా రెండో స్థానం కైవసం చేసుకున్నాడు. పెర్త్ టెస్టులో 161 పరుగులు చేయడంతో జైస్వాల్ ర్యాంక్ మెరుగయింది. ప్రస్తుతం జైస్వాల్ 825 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. నెం.01 బ్యాటర్ జో రూట్ 903 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇక పెర్త్ మ్యాచ్‌లోనే సెంచరీ బాదిన భారత సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి చేరుకున్నాడు. అటు టెస్టు ఆల్‌రౌండర్లలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ ఇద్దరూ పెర్త్ టెస్టులో బెంచ్‌కే పరిమితమైనా తమ ర్యాంకులను కోల్పోలేదు.