ఈ డ్రింక్స్ తాగితే... ఫ్యాటీ లివర్ ఎక్కువయ్యే చాన్స్!
- మారిన జీవన శైలితో చాలా మందిలో ఫ్యాటీ లివర్ సమస్య
- మనం ఆరోగ్యకరమని భావించే పానీయాలతోనూ ఇబ్బందే...!
- కాస్త జాగ్రత్తగా ఉంటే సమస్యను తగ్గించుకోవచ్చంటున్న నిపుణులు
ఇటీవలి కాలంలో ప్రతి పది మందిలో ఇద్దరు ముగ్గురికి ఎంతో కొంత ఫ్యాటీ లివర్ సమస్య ఉంటోంది. జంక్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్, వ్యాయామం లేకపోవడం వంటివి దీనికి కారణం. అయితే ఘనాహారమే కాకుండా కొన్ని రకాల పానీయాల వల్ల కూడా ఫ్యాటీ లివర్ సమస్య మరింత ముదురుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమని భావించే పండ్ల రసాలతోనూ ఇబ్బంది ఉంటుందని చెబుతున్నారు.
పళ్ల రసాలు..
చాలా మంది పళ్ల రసాలు ఆరోగ్యకరమని భావిస్తూ తరచూ తీసుకుంటూ ఉంటారు. ఇందులో కొంత వరకు నిజం ఉన్నా... సమస్యలు కూడా ఉన్నాయి. చాలా వరకు జ్యూస్ ల తయారీలో విపరీతంగా చక్కెర వేస్తారు. అదే సమయంలో పళ్ల పల్ప్ ను వడగట్టేస్తారు. అంటే పండ్లలోని సహజమైన ఫైబర్ పోతుంది. ఫైబర్ లేకపోవడం, అతి చక్కెర వల్ల జీర్ణ వ్యవస్థపై, కాలేయంపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పళ్లను మొత్తంగా తింటే మంచిదని సూచిస్తున్నారు.
ఆల్కహాల్...
ఫ్యాటీ లివర్ సమస్యకు ముఖ్య కారణాల్లో ఇదీ ఒకటి. ఆల్కహాల్ శరీరంలో కాలేయంలోనే విచ్ఛిన్నమవుతుంది. ఈ సందర్భంగా వెలువడే హానికర రసాయనాలు కాలేయాన్ని దెబ్బతీస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్యను మరింతగా పెంచుతాయి.
మాక్ టెయిల్స్, కూల్ డ్రింక్స్...
విభిన్న రుచుల కోసం ఉపయోగించే మాక్ టెయిల్స్, తరచూ తాగే కూల్ డ్రింక్స్ లలోనూ విపరీతంగా చక్కెర ఉంటుంది. అంతేగాకుండా వీటిలో కలిపే కొన్ని రకాల ఇతర పదార్థాలు కూడా కాలేయంపై ప్రభావాన్ని చూపుతాయి.
ఎనర్జీ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్...
వేగంగా శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తాయని చెప్పే... ఎనర్జీ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్ లో కొన్నింటిలో అత్యధిక స్థాయిలో కెఫీన్ ఉంటుంది. దానితో కాలేయంపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. అంతేకాదు ఈ డ్రింక్స్ లో కృత్రిమ రంగులు, రుచికోసం కలిపే పదార్థాలతోనూ శరీరానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.