సహజీవనం చేస్తున్న యువతిని చంపి 50 ముక్కలుగా కోసిన యువకుడు
- ఝార్ఖండ్‌లోని కుంతి జిల్లాలో ఘటన
- తమిళనాడులో ఓ యువతితో నిందితుడి సహజీవనం
- ఆమెకు తెలియకుండా సొంత రాష్ట్రంలో మరో యువతిని పెళ్లాడి వచ్చిన నిందితుడు
- సొంత ఊరు తీసుకెళ్లి సహజీవనం చేస్తున్న మహిళను గొంతు నులిమి చంపిన వైనం
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణం
తనతో సహజీవనం చేస్తున్న యువతిని దారుణంగా హత్య చేశాడో యువకుడు. ఆపై ఆమె శరీరాన్ని 50 ముక్కలుగా కోశాడు. రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని తాజాగా ఝార్ఖండ్‌లోని కుంతి జిల్లాలో అరెస్ట్ చేశారు.
నిందితుడు నరేశ్ భేంగ్రా (25), బాధితురాలు గంగి కుమారి (24) తమిళనాడులోని జోర్డాగ్ గ్రామంలో ఉంటున్నారు. గత కొన్నేళ్లుగా వీరు సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు తెలియకుండా నరేశ్ సొంత రాష్ట్రంలోని కుంతిలో వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమీ జరగనట్టుగానే తమిళనాడు వచ్చి గంగితో ఉంటున్నాడు.
ఈ క్రమంలో తనను కుంతి తీసుకెళ్లాలని గంగి పట్టుబట్టడంతో ఈ నెల 8న ఇద్దరూ కలిసి కుంతి వచ్చారు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో తనను తిరిగి తన గ్రామానికి తీసుకెళ్లాలని అతడిని ఒత్తిడి చేసింది. లేదంటే డబ్బులిస్తే వెళ్లిపోతానని చెప్పింది.
అందుకతడు నిరాకరించాడు. అనంతరం ఆమెను తన ఇంటి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఆమె చున్నీని గొంతుకు బిగించి చంపేశాడు. అనంతరం అటవీ జంతువులు తినేస్తాయన్న ఉద్దేశంతో ఆమె మృతదేహాన్ని 50 ముక్కలుగా కోసి విసిరిపడేశాడు.
ఈ నెల 24న ఓ శునకం ఆమె శరీర భాగాలను గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అడవిలో గంగికి చెందిన వస్తువులున్న బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆధార్‌కార్డ్, ఫొటో ఉన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు నరేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గంగిని తానే హత్య చేసినట్టు విచారణలో నిందితుడు అంగీకరించాడు.