ఆసక్తికరంగా అజిత్ కుమార్ 'విడముయార్చి' మూవీ టీజర్
- అజిత్ కుమార్, మగిజ్ తిరుమేని కాంబోలో విడముయార్చి
- 2025 పొంగల్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు సినిమా
- హీరోయిన్‌గా త్రిష.. ఇతర కీలక పాత్రల్లో అర్జున్, రెజీనా
- అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, మగిజ్ తిరుమేని కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం 'విడముయార్చి'. ఈ మూవీ టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. థ్రిల్లింగ్ అంశాలతో టీజర్ ఆసక్తికరంగా ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమా 2025 పొంగల్ సందర్భంగా విడుదల కానుంది. అజిత్ కుమార్‌తో మరోసారి త్రిషాకృష్ణన్ జత కడుతున్న ఈ మూవీలో ఇతర కీలక పాత్రల్లో సీనియర్ యాక్టర్ అర్జున్, హీరోయిన్ రెజీనా కసాండ్రా నటిస్తున్నారు. అలాగే యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ బాణీలు అందిస్తున్నారు.