తెలంగాణలో 'పుష్ప-2' టికెట్ ధరలు భారీగా పెంపు
- అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో 'పుష్ప-2'
- డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా
- తెలంగాణ వ్యాప్తంగా సినిమా టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి
- డిసెంబర్ 4న రాత్రి 9.30, అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోలకు కూడా ఓకే
- బెనిఫిట్ షో టికెట్ ధరలు రూ. 1000పైనే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప-2' సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తూ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అలాగే డిసెంబర్ 4న రాత్రి 9.30, అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోలకు కూడా సర్కారు ఓకే చెప్పింది.
రాత్రి 9.30 గంటల షోకు టికెట్ ధరను అదనంగా రూ. 800 పెంచింది. ఈ షో చూడాలంటే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లో ఎక్కడైనా సరే ప్రస్తుతం ఉన్న ధరకు అదనంగా రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. ఇక పెంపుతో కలుపుకొని సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ. 1000 అవుతుంటే, మల్టీప్లెక్స్‌లో రూ. 1200లకు పైగా అవుతోంది.
డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ. 150, మల్టీప్లెక్స్‌లో రూ. 200 చొప్పున పెంపునకు అనుమతి ఇచ్చింది. అలాగే డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ. 105, మల్టీప్లెక్స్‌లో రూ. 150 చొప్పున పెంపునకు అనుమతిచ్చింది.
ఇక డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ. 20, మల్టీప్లెక్స్‌లో రూ. 50 పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.