కేసులకు భయపడి వర్మ అడ్రస్ లేకుండా దాక్కున్నాడు: బుద్దా వెంకన్న

  • ఆర్జీవీపై ఏపీలో కేసులు నమోదు
  • విచారణ రాకుండా తప్పించుకు తిరుగుతున్న వర్మ
  • గత ప్రభుత్వం అండతో వర్మ ఇష్టానుసారం వాగాడన్న బుద్దా వెంకన్న
  • కోతిలా వాగుతున్న వర్మకు జగన్ సిగ్గులేకుండా వంతపాడుతున్నాడని ఆగ్రహం 
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీలో పలు చోట్ల కేసులు నమోదు కావడం, పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వడం తెలిసిందే. అయితే వర్మ విచారణకు హాజరుకాకపోవడంతో, ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో, టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. 

గత ప్రభుత్వం అండతో రామ్ గోపాల్ వర్మ నోటికొచ్చినట్టు వాగాడని విమర్శించారు. ఇప్పుడు కేసులకు భయపడి అడ్రల్ లేకుండా దాక్కున్నాడని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబును అవమానపరిచేలా చెత్త సినిమాలను జగనే తీయించాడని బుద్దా వెంకన్న ఆరోపించారు. అందువల్లే వర్మను కాపాడేందుకు జగన్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. 

అమెరికాలో కూడా ఏపీ పరువు తీసిన చరిత్ర జగన్ ది... అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని విమర్శించారు. జగన్ ఆదేశాలతోనే సామాజిక మాధ్యమాల్లో నీచమైన పోస్టులు పెడుతున్నారని, వర్మ పెట్టిన పోస్టులు కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినవేనని బుద్దా ఆరోపించారు. 

కోతిలా వాగుతున్న వర్మకు జగన్ వంతపాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News