విభజన అంశాలపై ఏపీ, తెలంగాణ సీఎస్ల భేటీ... తేలని విద్యుత్ బకాయిల అంశం
- దాదాపు రెండు గంటల పాటు సాగిన అధికారుల సమావేశం
- లేబర్ సెస్ పంపకానికి కుదిరిన అంగీకారం
- డ్రగ్స్ నివారణపై సంయుక్త కమిటీ వేయాలని నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంశాలపై జరిగిన రెండు రాష్ట్రాల సీఎస్ల సమావేశంలో మూడు అంశాలు కొలిక్కి రాగా, విద్యుత్ బకాయిల అంశం మాత్రం తేలలేదు. విభజన అంశాలపై చర్చించేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల కమిటీ ఈరోజు ఏపీలో భేటీ అయింది. ఇరురాష్ట్రాల సీఎస్ల నేతృత్వంలో అధికారుల కమిటీ దాదాపు రెండు గంటల పాటు సమావేశమైంది.
రూ.861 కోట్ల మేర లేబర్ సెస్‌ను ఏపీ-తెలంగాణ మధ్య పంపకానికి అంగీకారం కుదిరింది. ఈ పన్నుల పంపకాలపై ఇరు రాష్ట్రాల శాఖల అధికారులు సమావేశమై ఓ నిర్ణయానికి రావాలని అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. 9, 10వ షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పులు పంపకాల అంశం కూడా తేలలేదు.
ఉద్యోగుల మార్పిడిపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. డ్రగ్స్ నివారణపై సంయుక్త కమిటీ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. పోలీస్, ఎక్సైజ్ శాఖలతో సంయుక్త కమిటీ వేయాలని నిర్ణయించారు. విభజన అంశాలపై చర్చించేందుకు మరోసారి భేటీ కావాలని సీఎస్‌లు నిర్ణయించారు.